అల్లు అర్జున్ అరెస్ట్.. అసలు కారణం ఇదే..
‘పుష్ప-2’ చిత్రం హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి అసలు కారణం ఏమిటంటే ‘పుష్ప-2’ రిలీజ్ రోజు ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. దీనిపై మహిళ భర్త ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మరణానికి అల్లు అర్జున్ పరోక్షంగా కారణమయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ థియేటర్‌కు అల్లు అర్జున్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం బౌన్సర్ల సహాయంతో రావడం తప్పని పోలీసులు చెప్తున్నారు. గతంలోనే సంధ్య థియేటర్ ఓనర్‌ని, మేనేజర్‌ని, ప్రీమియర్ షో నిర్వాహకులని, బౌన్సర్లను అరెస్టు చేశారు. అప్పుడే ఈ విషయంలో అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. ఆ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అన్ని విధాల సహాయంగా ఉంటానని, రూ. 25 లక్షల సహాయం అందిస్తానని మాట ఇచ్చారు. ఈ విషయంపై అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.