అభిమాని చేసిన పనికి ఆశ్చర్యపోయిన అల్లుఅర్జున్
అల్లుఅర్జున్ వీరాభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ నుండి తనను కలిసేందుకు సుమారు 1600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి వచ్చిన అభిమానిని చూసి అల్లుఅర్జున్ ఆశ్చర్యపోయారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అభిమాని మోహిత్‌ని కలిసారు. 16 రోజుల పాటు సైకిల్‌పై ప్రయాణం చేసి తనకోసం వచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంట్లోకి పిలిచి ముచ్చటించారు. తాను ఉత్తర ప్రదేశ్ పుష్ప-2 చిత్ర ప్రచారం కోసం వచ్చినప్పుడు అతనిని ఆహ్వానిస్తానని హామీ ఇచ్చారు. దీనితో చాలా సంతోషపడ్డాడు మోహిత్. తన సిబ్బందితో చెప్పి అతని తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయించారు అల్లు అర్జున్.
