అల్లు అర్జున్ పై తీరని పగ….
పగో…ప్రణాళికో…పరిపాలనా చిత్తశుద్దో తెలీదు గానీ అల్లు ఫ్యామిలీ కుటుంబీకులపై తెలంగాణ ప్రభుత్వం వేధింపులను క్రమబద్దీకరిస్తున్నట్లు స్పష్టమౌతుంది.పుష్ప 2 సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అది బన్నీ మెడకు ఎలా చుట్టుకుందో అందరికీ తెలిసిందే.ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ ,కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గాందీభవన్ మెట్లెక్కి అభ్యర్ధించాడు.ఈ కేసు విషయంలో బన్నీ ఇప్పటికీ సంఘర్షణకు లోనౌతూనే ఉన్నాడు.తాజాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి ఓ ఆపద వచ్చింది. కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో తన ఇల్లు స్థలం ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో కోరారు.తన ఇల్లు కూల్చొద్దని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని అభ్యర్ధించాడు.మొత్తం మీద అల్లు వారు,వారి వియ్యంకుల మీద తెలంగాణ సర్కార్ గట్టిగానే ఫోకస్ చేసినట్లు ఫిల్మ్ అండ్ పొలిటికల్ హబ్ లో జోరుగా ప్రచారం సాగుతుంది.