Home Page SliderNational

అల్లు అర్జున్, మంచు విష్ణు బిగ్ ఫైట్.. ప్రభాస్ అండతో పాన్ ఇండియా వార్

మళ్ళీ చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో పలు భారీ చిత్రాలు రావడం మొదలయ్యాయి. ఈ ఏడాదిలో కాస్త తక్కువ సినిమాలే వచ్చినప్పటికీ వచ్చిన సినిమాలు కూడా ఈ ఏడాది ప్రథమార్థంలో దుమ్ము లేపాయి. ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం మొదటి కంటే ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది.
కాగా ఈ పాన్ ఇండియా చిత్రాలు చూసినట్టు అయితే నాచురల్ స్టార్ నాని "సరిపోదా శనివారం" నుంచి కౌంట్ చేస్తే ఒకో నెలలో మినిమమ్ ఒకటి కనిపిస్తుంది. అలా డిసెంబర్ వరకు కూడా భారీ సినిమాలు వరుసగా ఫిక్స్ అయ్యి ఉన్నాయి. కాగా ఈ డిసెంబర్‌లో అయితే భారీ క్లాష్ ఉండబోతుంది అని ఇప్పుడు సినీ వర్గాల్లో రూమర్స్ మొదలయ్యాయి.
మరి కన్నప్ప వల్ల పుష్ప 2 పోస్ట్ పోన్ అయ్యింది అనే దానికంటే ఇప్పుడు ఒకేరోజులో క్లాష్‌కి వచ్చి అది కూడా పుష్ప 2 ని మించి థియేటర్స్ దక్కించుకోవడం అనే పెద్ద దెబ్బే అని చెప్పి తీరాలి. కన్నప్పపై కూడా ఇప్పుడు మంచి అంచనాలు బిల్డప్ అవుతున్నాయి. కాగా ఇందులో విష్ణుతో పాటుగా పాన్‌ ఇండియా బిగ్గెస్ట్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌లు నటిస్తున్నారు.
అలాగే మళయాళ స్టార్ మోహన్ లాల్, తమిళ్ నుంచి నయనతార, శరత్ కుమార్ ఇంకా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లాంటి స్టెల్లార్ కాస్ట్‌తో రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ సెట్ చేస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం పుష్ప 2 లా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా భాషలు సహా ఇంగ్లీష్‌లో కూడా కన్నప్ప ఏక కాలంలో విడుదల కానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.