మళ్లీ క్రేజీ కాంబినేషన్‌లో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అది సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కొట్టారు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అలవైకుంఠపురములో’ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ‘పుష్ప’ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేయడానికి దర్శకులు లైన్లో వేచి ఉన్నారు. కానీ బన్నీ మాత్రం దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందట. మరోపక్క, ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమాను పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా పూర్తయ్యేలోపు ‘పుష్ప-2’ కూడా పూర్తవుతుంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత బోయపాటితో కూడా బన్నీ కమిట్ అయినట్లు సమాచారం.