Home Page SlidermoviesTelanganatelangana,

‘పుష్ప-2’ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఎమోషనల్..

‘పుష్ప-2 ది రూల్’ ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ యూసఫ్‌గూడాలో ధూంధాంగా జరిగింది. అభిమానులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతుండగా,  హీరో అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అయి, కన్నీళ్లు పెట్టుకున్నారు. సుకుమార్ మాట్లాడుతూ “బన్నీతో నా ప్రయాణం ఆర్యతో మొదలయ్యింది. వ్యక్తిగా, నటుడిగా తాను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వస్తున్నా. తను నాకోసం మరో మూడేళ్లు సమయం ఇస్తే ‘పుష్ప- 3’ కూడా చేస్తా.  ‘పుష్ప’ చిత్రాలు ఇలా తయారవడానికి కారణం తనపై నాకున్న ప్రేమే” అన్నారు. డైరక్టర్ మాటలు విన్న అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఆయన మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత అభిమానులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనను నమ్మి నిర్మాతలు  ఎక్కడా తగ్గకుండా కోట్లు కుమ్మరించారని పేర్కొన్నారు.    మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి.