Andhra PradeshHome Page Slider

ఇవాళ ఆళ్లగడ్డలో ఆలిండియా రేడియో ఎఫ్ఎం ప్రారంభం

నేడు ఆళ్లగడ్డ లో ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎంను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. వంద వాట్ల సామర్థ్యాన్ని కలిగిన 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా రేడియో కనెక్టివిటీకి మరింత ఊపందుకోనుంది. దేశంలో ఎఫ్ఎం కనెక్టివిటీని పెంచటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని 18 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాలలో ఒక్కొక్కటి 100వాట్ల సామర్థ్యం కలిగిన 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను కొత్తగా స్థాపించారు. ఎఫ్ఎం ప్రసారాల కవరేజీని బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ ,ఛత్తీస్గడ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలైన లడక్, అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించారు. ఆకాశవాణి ఎఫ్ఎం సేవలు పరంగా ఈ విస్తరణతో ఇంతవరకు రేడియో మాధ్యం లభ్యం కానీ రెండు కోట్ల మందికి ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్మిటర్ ప్రారంభోత్సవంలో భాగంగా ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం ప్రారంభోత్సవంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బ్రీజేందర్ రెడ్డి, మేయర్ రామలింగేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొననున్నారు.