Home Page SliderNational

కాంగ్రెస్ తో పొత్తు ఖరారు..

జమ్మూకాశ్మీర్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సీట్ల పంపకాల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాశ్మీర్ లోయలో 12 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. జమ్మూ డివిజన్లో ఎన్సీకి 12 సీట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం.