జగన్ తిరుమల పర్యటనపై వెనుకంజ వేసిన కూటమి నేతలు
వైసీపీ నేత జగన్ తిరుమల పర్యటన విషయంలో ఉద్రిక్తతలు ఏర్పడతాయని భావించి తిరుపతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పోలీస్ ఫోర్స్‌ను తిరుమతిలో మొహరించి వైసీపీ నేతలను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే కూటమి నేతలు మరోసారి సమావేశమయిన అనంతరం తమ ఉద్దేశాన్ని మార్చుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని భావించారు. లడ్డూలో కల్తీనెయ్యికి కారణం జగనే అని ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు తిరుపతిలో జగన్ పర్యటించనున్నారు. అయితే ఆయన తిరుమలకు వెళ్లేందుకు డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు.

