Andhra PradeshHome Page SliderNews

దానమిచ్చిన అన్నపైనే ఆరోపణలు

చంద్రబాబు ఇంట్లో ఏనాడూ వారి తల్లిని, చెల్లిని చూడలేదని, వారికి ఏనాడూ పైసా ఇచ్చి ఎరుగరని, కానీ వారు ఎప్పుడూ రచ్చకెక్కలేదని పేర్కొన్నారు. వారిని చూసి నేర్చుకోమని, దాన విక్రయం ఇచ్చిన అన్న పైనే ఆరోపణలు చేస్తున్న షర్మిలకు హితవు చెప్పారు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి. అసలు వైఎస్సార్ కొడుకు కంటే కూతురుకే ఎక్కువ ఆస్తులు ఇచ్చారని గుర్తు చేశారు.  జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరడం అన్యాయమైనప్పటికీ జగన్ ఇస్తానని మాటివ్వడం ఆయన ఔదార్యమన్నారు. జగన్ బెంగళూరులో ఉంటూ సాక్షి, భారతి సిమెంట్స్ వ్యాపారాలు చేసుకునేవారని, ఆయన తెలివితో వ్యాపారాలు వృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు. అన్నను ఇబ్బంది పెట్టాలని, చంద్రబాబుతో చేతులు కలిపి కుటుంబాన్ని రోడ్డుకీడుస్తున్నారని షర్మిలపై మండిపడ్డారు.