ఓటర్లందరూ తమ ఓటును తప్పకుండా వెయ్యాలి: గవర్నర్ తమిళిసై
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది, పవిత్రమైనదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ సైనికుడిలా తమ ఓటును వినియోగించుకోవాలని, పనులన్నీ పక్కన పెట్టి ముందుచూపుతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.


 
							 
							