Home Page SliderNational

T20 వరల్డ్‌కప్‌ సాధించిన ఒక్కో క్రికెటర్‌కు అన్ని కోట్లా..?

T20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అదరగొట్టి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు BCCI రూ.125 కోట్ల భారీ నజరానా అందించింది. అయితే ఈ భారీ నజరానాలో ఒక్కో క్రికెటర్‌కు ఎంత అందబోతుందని సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని పంచగా 15 మంది క్రికెట్ ఆటగాళ్లకు,కోచ్ ద్రవిడ్‌ ఒక్కొక్కరికి రూ.5 కోట్లు రానున్నాయి. అయితే మిగిలిన కోచ్‌లు రూ.2.5 కోట్ల చొప్పున అందుకోనున్నారు. అలాగే బ్యాక్ రూమ్ స్టాఫ్‌కు తలా రూ.2 కోట్లు,సెలక్షన్ కమిటీలోని సభ్యులు,రిజర్వ్ ప్లేయర్లు రూ.కోటి చొప్పున అందుకుంటారని సమాచారం. అయితే ఇటీవల జరిగిన టీమిండియా విక్టరీ పేరెడ్‌లో BCCI వాంఖడే స్టేడియంలో టీమిండియాకు రూ.125కోట్ల చెక్కును అందించింది.