దేశంలో విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయి
దేశంలో విమానాలన్నీ దాదాపుగా టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి” అని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇండిగో విమానయాన సంస్థలో నెలకొన్న భారీ కార్యకలాపాల అంతరాయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం, సంపద కేవలం ఒకరిద్దరి చేతుల్లోనే కేంద్రీకృతమైతే, ఇప్పుడు దేశంలోని విమానాశ్రయాల్లో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితే ఉత్పన్నమవుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ ఈ విషయాలు మాట్లాడారు. పైలట్లను దోపిడీ చేయవద్దని కేంద్రంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గత ఏడాది స్పష్టంగా షరతులు విధించినప్పటికీ, విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేకపోయాయని కేటీఆర్ అన్నారు. ఫలితంగానే ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. “ఐదు రోజుల తర్వాత కేంద్రమే వెనక్కి తగ్గింది. తాను ఇచ్చిన ఆదేశాలను తానే ఉపసంహరించుకుంది, కానీ ఇండిగో వెనక్కి తగ్గలేదు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు .వ్యాపార నిర్వహణ సులభతరం ఉండాలని, కానీ అది నాణ్యతతో కూడుకొని ఉండాలని ఆయన అన్నారు.

