Home Page SliderTelangana

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట: రేవంత్‌ రెడ్డి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత కొడంగల్, మధిరలో 20-25 ఎకరాల్లో వీటిని నిర్మిస్తామన్నారు. ఆదివారం ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన పలు  నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. కాగా గురుకులాలన్నీ ఒకేచోట నిర్మించడం ద్వారా కుల, మత వివక్ష తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.