Home Page SlidermoviesNationalTrending Today

‘నా దృష్టంతా దానిమీదే’..హీరో అజిత్

ప్రముఖ హీరో అజిత్ తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలను వెల్లడించారు. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో కార్ల రేసింగ్ టీమ్‌ను ఇటీవల ఆయన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. తన ఫోకస్ అంతా మొత్తం రేసింగ్‌పై పెట్టానని, త్వరలో జరగనున్న రేసింగ్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. రేసింగ్‌ లేనప్పుడే సినిమాలపై దృష్టి పెడతానని ఆయన పేర్కొన్నారు.