Home Page SliderTelangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించాలి..

తన బావమరిది రాజ్ పాకాల, సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరిని వెనుకేసుకురావడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ ఫైర్ అయ్యారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలన్నారు. జన్వాడ ఫాంహౌస్ ఎప్పుడూ వివాదాలకు కేంద్రంగా ఉంటోందన్నారు. ఓసారి పట్టుబడితే దీపావళి ఫెస్ట్ అంటారు… ఇంకోసారి పట్టుబడితే గృహప్రవేశమని చెబుతారని, ప్రతిసారి ఏదో కారణం చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేద్దామనుకుంటే… బీఆర్ఎస్ మాత్రం డ్రగ్స్ ను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా పక్కదారి పట్టించిందో అందరికీ తెలుసని ఈ సందర్భంగా అనిల్ యాదవ్ గుర్తు చేశారు.