Home Page SliderTelangana

మహంకాళి బోనాలకు అన్ని ఏర్పాట్లు: మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం: బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న సమయంలో జులై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 21న బోనాలు, 22న రంగం మహోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.