అలియా చిన్నారిని ఇన్నాళ్లకు చూపించారు
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, స్టార్ హీరో రణబీర్ కపూర్‌ల గారాలపట్టి చిన్నారి రాహాను పుట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత క్రిస్మస్ పండుగ సందర్భంగా మీడియాకు చూపించారు. ఈ సెలబ్రిటీ కపుల్ తమ కుమార్తెను మీడియా కంట పడకుండా ఎక్కడికెళ్లినా జాగ్రత్త పడతున్నారు. అయితే ఈసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా వీరు పాపతో సహా మీడియా కంట పడ్డారు. అయితే ఈసారి బాగానే ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనితో కపూర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చిన్నారి రాహా చాలా క్యూట్‌గా ఉందని, ఈ పాపకు ముత్తాత రాజ్ కపూర్ కళ్లు, తాతయ్య రిషి కపూర్ పోలికలు వచ్చాయని పోస్టులు పెడుతున్నారు. నీలికళ్లతో చాలా క్యూట్‌గా ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.