నోటీసులపై స్పందించిన అలీ
సినీ నటుడు అలీకి చెందిన ఫామ్ హౌజ్ లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మా ణాలు చేపడుతున్నారని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నోటీసుల పై అలీ స్పందించారు. ఓ కన్వన్షన్ సెంటర్ కోసం లీజుకు ఇచ్చానని చెప్పారు. నిర్మాణాలపై లీజుకు తీసుకున్నవారే సమాధానం చెప్తారని అన్నారు.