Home Page SliderNewsPoliticsTelanganatelangana,Trending Today

నగర ప్రజలకు హైఅలర్ట్..మాక్ డ్రిల్‌లో ఏం జరుగుతుంది?

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దానిలో హైదరాబాద్ కూడా ఉంది. ఈ మాక్ డ్రిల్ వల్ల సాధారణ ప్రజలకు ఎదురయ్యే పరిణామాలు, పారా మిలటరీ వ్యవహరించే విధానం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్ కావచ్చు. అలాగే ట్రాఫిక్ దారి మళ్లింపు, మొబైల్ సిగ్నల్స్ నిలిపివేత, పబ్లిక్ అనౌన్స్‌మెంట్లు జరగవచ్చు. కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. ఈ మాక్ డ్రిల్స్ సన్నద్ధత కోసమే కానీ, ప్రజలను ఆందోళనకు గురిచేయడానికి కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలందరూ ఆందోళనకు గురికాకుండా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కరెంట్ లేకపోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా భయపడవద్దు. స్థానికంగా ఇచ్చే సూచనలు పాటించాలి. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ ఛానల్స్, రేడియోను మాత్రమే వినండి. ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. సైరన్ మోగగానే ప్రజలు వైమానిక దాడుల నుండి రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. నగరాలలో విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడులలో నగరాలను గుర్తించకుండా ఈ ఏర్పాటు చేస్తారు. పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలలో శిక్షణ ఇస్తారు. సురక్షిత ప్రాంతాలను గుర్తిస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఎమర్జెన్సీ సమయాలలో ఆందోళనకు గురికాకుండా ఉండడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. హై రిస్క్ జోన్లలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.