వామ్మో.. ఏసీలో పాములు
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఏసీలు కామన్ అయిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఏసీ అనేది కంపల్సరీ అయింది. అయితే.. ఏసీలో పాములు ఉండటం ఎప్పుడైనా చూశారా.. అవును నిజమే.. ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు పెట్టింది. ఇది గుర్తించిన ఆయన స్నేక్ క్యాచర్ కిరణ్‌కు పిలిచాడు. ఆయన వచ్చి ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటికి తీశారు. మీరు కూడా ఏసీలను క్లీన్ చేసుకోండి. అందులో ఏమైనా ఉంటే బయటపడే అవకాశాలు ఉన్నాయి.

