Home Page SliderTelangana

తీరప్రాంత గ్రామాలకు అలర్ట్

కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్‌గా ఉండాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిలో పడవలు, చిన్న బోట్లలో ప్రయాణించవద్దని హెచ్చరించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి, నాగార్జున సాగర్ నుండి కృష్ణానది ప్రవాహం భారీగా పెరగడంతో ఈ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నదిలో ఈతలు కొట్టడం, చేపలు పట్టడం కూడా చేయవద్దని, జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొంది. పల్లె ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేశారు.