పలాసలో ఆందోళనకర పరిస్థితి.. టీడీపీ నేత అరెస్ట్
పలాసలోని శ్రీనివాసనగర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు కొందరు రెవెన్యూ , పురపాలక శాఖ అధికారులు ప్రొక్లెయిన్‌తో ఆ ప్రాంతానికి వెళ్లారు. 27వ వార్డు పరిధిలో ఉన్న చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు వచ్చినట్టు చెప్పారు. దీంతో అక్కడి ప్రజలు అధికారులతో గొడవకు దిగారు. ఇక్కడ అటువంటి అక్రమ నిర్మాణాలు లేవని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఈ నేపథ్యంలో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఈ ఘటన పై సమాచారం అందుకున్న ఇచ్చాపురం పోలీసులు వెంటనే ఆ స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులకు అండగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను అరెస్ట్ చేశారు.