Home Page SliderNational

పరమశివునిగా అక్షయ్ కుమార్ –OMG 2 టీజర్ అవుట్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి ప్రేక్షకులను భగవంతుడి వేషంలో ఉర్రూతలూగించబోతున్నాడు. OMG 2 చిత్రంలో పరమశివుని వేషంలో కనిపించి అభిమానులకు కనులవిందు చేయబోతున్నారు. OMG (ఓ మై గాడ్) చిత్రంలో కృష్ణునిగా నటించి భక్తుని కష్టాలు తీర్చిన పాత్రలో అక్షయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రాన్ని ‘గోపాల గోపాల’ పేరుతో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ముఖ్యపాత్రలతో రీమేక్ చేయగా తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పరమేశ్వరుడు భూమిపై వచ్చి భక్తుని కష్టాలను పోగొట్టే వేషంలో అక్షయ్ నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఈరోజు రిలీజ్ కాగా, అభిమానులు సూపర్ అంటున్నారు. ఈ చిత్రంలో భక్తునిగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నారు. కాగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు చాలా బాగుందని, తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని పోస్టులు పెడుతుంటే, కొందరు అక్షయ్ వేషభాషలు శివునికి తగినట్లు లేవని, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయంటున్నారు. ఈ చిత్ర టీజర్‌ను అక్షయ్ కుమార్ ‘విశ్వాసం ఉంచండి’ అనే పేరుతో ట్విటర్‌లో పంచుకున్నారు. ఆగస్టు 11న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.