శ్రీ శైలంలో అక్కినేని వారి కొత్త జంట
శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున,ఆయన తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు తరించారు.ముందుగా ఆలయానికి చేరుకున్న అక్కినేని కుటుంబీకులకు ఆలయ అర్చకులు ,అధికార సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాగచైతన్యకు రెండో వివాహం కావడంతో దోషనివారణ కోసం మల్లన్న దర్శనానికి వచ్చినట్లుతెలిసింది.అనంతరం కొత్త జంటకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేసి శేషవస్త్రం,స్వామి వారి పటం,ప్రసాదం అందజేశారు.కార్యక్రమంలో నాగార్జున కుటుంబీకులు,సన్నిహితులు ఉన్నారు.