నందమూరికి ఓ రేంజ్‌లో అక్కినేని కౌంటర్
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కామెంట్స్ రచ్చ కొనసాగుతోంది. అక్కినేని, తొక్కనేని అంటూ అంటూ బాలయ్య యధాలాపంగా చేసిన కామెంట్స్‌కు అటు అక్కినేని నాగచైతన్య, ఇటు అఖిల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు.. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడమేనంటూ అక్కినేని నాగచైతన్య ట్వీట్ చేశారు. అదే సందేశంతో అక్కినేని అఖిల్ సైతం ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మొత్తంగా బాలకృష్ణ వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీని తాకాయి. బాలయ్య కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో కల్లోలం రేపుతున్నాయ్. ఏదో చెప్పబోయి.. ఇంకేదో మాట్లాడడం వల్ల కామెంట్స్ కాక రేగుతోంది. ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే మరింత ముదురుతుందా అన్నది చూడాల్సి ఉంది. అక్కినేని, తొక్కనేని అంటూ బాలయ్య ఏమన్నారో ఒకసారి చూద్దాం…

