“అక్బరుద్దీన్ కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేస్తే గెలిపిస్తా”: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ బీఫామ్‌పై..అక్బరుద్దీన్ పోటీ చేస్తే గెలిపిస్తామన్నారు.దీని కోసం తానే చీఫ్ ఏజెంట్‌గా ఉండి మరి గెలిపిస్తానని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాకుండా అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని సీఎం వెల్లడించారు.