Home Page SliderNational

MI VS LSG మ్యాచ్‌లో అదరగొట్టిన MI బౌలర్ ఆకాశ్

ఈ IPL సీజన్ ఫైనల్ మ్యాచ్‌ ఈ నెల 28 జరగనుంది. దీంతో ఈసారి IPL ట్రోఫీని ఎవరు దక్కించుకుంటారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో  సత్తా చాటిన నాలుగు జట్టుల  మధ్య క్వాలిఫయింగ్ రౌండ్ కూడా ముగిసింది. కాగా మొన్న జరిగిన CSK VS GT మ్యాచ్‌లో CSK గెలుపొందింది. అయితే నిన్న జరిగిన MI VS LSG మ్యాచ్‌లో MI ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 82 పరుగుల తేడాతో LSGపై చేయి సాధించి ఫైనల్స్‌కి దూసుకుపోయింది. కాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్ మధ్వాల్ అద్భుత ప్రదర్శన కనబరిచి ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. నిన్నటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలలో 182/8 స్కోరు చేసింది. తన ప్రత్యర్థి జట్టు లఖ్‌నవూ లక్ష్య ఛేధనలో 101 పరుగులకే ఆలౌట్ చేసింది. కాగా ముంబయి బౌలర్ ఆకాశ్ లఖ్‌నవూకు కేలవం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సంచలన బౌలింగ్ చేశాడు. దీంతో అందరి దృష్టి ఈ బౌలర్‌పైనే పడింది. ఈ విధంగా ఆకాశ్ IPLలో సరికొత్త రికార్డు సృష్టించాడు.కాగా ముంబయి చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌గా ఆకాశ్ అవతరించాడు. దీంతో ఆయనకు నిన్నటి   మ్యాచ్‌లో “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది.