తప్పుడు యూట్యూబ్ ఛానెల్స్‌పై కోర్టుకెక్కిన ఐశ్వర్యరాయ్ కుమార్తె
ప్రముఖ అందాలనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ల కుమార్తె చిన్నారి ఆరాధ్య తరపున కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కోర్టులో కేసు వేసారు బచ్చన్ కుటుంబం. ఆరాధ్య ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్. ఆమె చనిపోయిందని, కాలుకు పోలియో వచ్చిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ ఇలాంటి వార్తలు సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ ఛానెల్స్ పద్దతి మార్చుకోలేదు. దీనితో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బచ్చన్ కుటుంబీకులు. ఈరోజు కేసు విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి. హరి శంకర్ గూగుల్‌ను, యూట్యూబ్ ఛానెల్స్‌ను నిలదీసారు. ప్రతీ చిన్నారికీ గౌరవ మర్యాదలతో జీవించే అర్హత ఉందని, ఇలాంటి తప్పుడు సమాచారాల వల్ల వారి మనసు గాయపడే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. వెంటనే ఇలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, ఫేక్ కంటెట్లను వారి వ్యూస్ కోసం ఉపయోగించుకుంటే శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. గూగుల్‌ను కూడా ఈ విషయంలో సమాధానం ఇవ్వాలని, వారి పాలసీని పేర్కొనాలని సూచించారు. ఈ 10 యూట్యూబ్ ఛానెల్స్‌ను పూర్తిగా పబ్లిషింగ్‌కు, వీడియో అప్‌లోడింగ్‌కు అనర్హులుగా ప్రకటించారు.

ఈమధ్య జరిగిన నీతాఅంబానీ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఇండియా ఇన్ ఫ్యాషన్ అనే కార్యక్రమంలో తన తల్లి ఐశ్వర్యతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది ఆరాధ్య.

