ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. టికెట్ ధర తెలిస్తే షాక్..
విమానంలో వెళ్లాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఛార్జీలు వేలల్లో ఉండడంతో సామాన్యులకు సాధ్యం కాదు. అయితే.. ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. చౌక ధరలోనే విమానంలో జర్నీ చేయొచ్చు. ఎలా అంటే..? ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా విమాన టికెట్స్ పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన ‘నమస్తే వరల్డ్ సేల్’ లో భాగంగా రూ.1499 విమాన ప్రయాణం కల్పించనుంది. దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్స్ రూ.1499, ప్రీమియం ఎకానమీ రూ.3,749 కు ప్రారంభంకానున్నాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.9,999 మొదలవుతాయి. ఈ నెల 6 వరకూ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్, యాప్ లలో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 12 నుంచి అక్టోబర్ 31 తేదీలలో ప్రయాణించవచ్చు.

