ఎన్నికల ప్రచారంలో ఏఐ
ఎన్నికల ప్రచారంలో ఏఐని వినియోగిస్తున్న పార్టీలు, కంటెంట్ పారదర్శకంగా ఉండాలని ఈసీ సూచించింది. అభ్యర్థులు వాటిపై జవాబుదారీతనంతో వ్యవహరించాలని అడ్వైజరీలో పేర్కొంది. ఈ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ఆడియో, వీడియోలు, చిత్రాలపై ఏఐ జనరేటెడ్, సింథటిక్ కంటెంట్ వంటి సంకేతాలను లేబుల్ చేయాలి. ప్రచార ప్రకటనలను వ్యాప్తి చేసే సమయంలో సింథటిక్ కంటెంట్ వినియోగించినా దానికి డిస్ క్లైమర్స్ ఇవ్వాల్సి ఉంటుందని సూచించింది. నకిలీ కంటెంట్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈసీ కీలక సూచనలు చేసింది.

