రాజ్యసభలో తెలుగురాష్ట్రాలకు మళ్లీ ‘మొండిచెయ్యే’
రాజ్యసభ సీట్లకు 10 మందిని ప్రకటించింది బీజేపీ పార్టీ. అయితే వారిలో ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు లేరు. దీనితో కేంద్రం మళ్లీ తెలుగువారికి మొండిచెయ్యి చూపిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో అధ్యక్షులను మార్చిన కారణంగా కనీసం ఇక్కడ నుండి ఒక్కరైనా రాజ్యసభకు వెళ్లొచ్చని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. గుజరాత్ నుండి బాబు భాయ్, దేవ్‌సిన్హ్ జా లకు అవకాశం లభించింది. బెంగాల్ నుండి అనంత మహరాజ్, గుజరాత్ నుండి కేంద్రమంత్రి జయ శంకర్ ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ నెల 24న 10 స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. బెంగాల్‌లో 6, గుజరాత్‌లో 3, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజ్యసభ నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. మొత్తం ఐదు స్థానాలలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి.