Home Page SliderNational

మళ్లీ భగ్గుమన్న మణిపూర్- ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

మణిపూర్‌లో చెలరేగిన హింస ఇంకా చల్లబడలేదు. రాజధాని ఇంఫాల్‌లో న్యూచెకాన్ అనే ప్రాంతంలో ఆందోళనకారులు మళ్లీ విజృంభించారు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. గత నెలలో హింసాత్మక సంఘటనలో విలవిలలాడిన ఈ ఈశాన్యరాష్ట్రం పోలీసుల కట్టుదిట్టమైన భద్రతాచర్యలు, మిలటరీ దళాల పహారాలతో కొన్నిరోజులుగా సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ అసలు వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. స్థలం విషయంగా మెయిటీ, కుకీ అనే తెగల మధ్య జరిగిన ఘర్షణల కారణంగానే మళ్లీ ఈ సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ప్రభుత్వం మళ్లీ భద్రతాదళాలను మోహరించింది. ప్రజలు మంటల్లో చిక్కుకోకుండా సహాయక చర్యలు ప్రారంభించింది. కర్ఫ్యూ విధించింది. తిరిగి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.