అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు
అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీష్‌తో మరో నిందితుడు జత కలిసి దోపిడీలకు పాల్పడుతున్నారు. వారం క్రితం నుండి దోపిడీలు మొదలుపెట్టారు. ఛత్తీస్‌గఢ్, బీదర్‌లో భారీ దోపిడీలు చేశారు. మనీష్‌పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. బీహార్ ప్రభుత్వం మనీష్‌పై రివార్డు కూడా ప్రకటించింది. మనీష్ కోసం నాలుగు రాష్ట్రాల పోలీసుల వేట కొనసాగుతోంది. నిందితుల కోసం తెలంగాణ, బిహార్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.