మధ్యాహ్నం టీడీపీ శాసనసభా పక్ష సమావేశం
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా టీడీపీ మూడు రాజధానుల వైపు ప్రభుత్వ అడుగులపై చర్చించనుంది. అంతా కాకుండా సీఐడీ తాజా అరెస్టులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కాగా టీడీపీ అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో కేసులు ఉద్దేశపూర్వకమే అంటోంది. వైసీపీ ప్రభుత్వం అసలు లావాదేవీలే జరగని అంశాల్లో అక్రమ కేసులు పెట్టిందని మండి పడుతోంది. వైసీపీ పెట్టిన కేసులన్నీ సంబంధం లేని సెక్షన్లు అంటూ కోర్టు ఇప్పటికే రిమాండ్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తప్పుడు సెక్షన్లు పెట్టిన సీఐడీ అధికారులపై ప్రైవేట్ కేసులకు కసరత్తు చేసే దిశగా చర్చించనుంది . మరోవైపు వైజాగ్ రాజధాని అంటూ స్పీడు పెంచిన సీఎం జగన్ నిర్ణయంపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.