మధ్యాహ్నం రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు
ప్రముఖ టాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా నిన్న తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భాభ్రాంతికి గురైంది. ఆయన టాలీవుడ్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. దీంతో అభిమానులు ఆయనను రెబల్ స్టార్ అని పిలుచుకునేవారు. అటువంటి మహనీయ వ్యక్తి మృతి చెందడం పట్ల సెలబ్రెటీలు, అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు మెయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. ఈ రోజు మధ్యహ్నం 1 గంటకు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అంజలి ఘటించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఆయన సొంత నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.