సీఎం జగన్ వచ్చిన తర్వాత పంచాయతీల నిధులను ఇతర రంగాలకు..
ఏపీ: గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు, టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల నిధులను ఇతర రంగాలకు దారి మళ్లించారని ఆరోపించారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడానికి నిధుల లేమి పరిస్థితులు ఉన్నాయి. సర్పంచ్‌లకు అధికారం లేకుండా చేశారని విమర్శించారు.

