Home Page SliderInternational

అమెరికాలో 180 ఏళ్ల అనంతరం భారీ హరికేన్ ముప్పు

అమెరికాలోని ఫ్లోరిడా సిటీకి హరికేన్ హెలెన్ వలన భారీ ముప్పు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇది అతి తీవ్రమైన తుఫానుగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుండి అమెరికాలోని ఫ్లోరెడా వైపు వస్తోంది. 1851 తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో హరికేన్లు రాలేదంటున్నారు అమెరికన్లు. దీనితో హరికేన్ ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ హరికేన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అక్కడి రోడ్లన్నీ వరదనీటితో మునిగిపోయాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇది తీవ్రమైన హరికేన్‌గా మారే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది. హెలెన్ హరికేన్ కేటగిరి-3లేదా కేటగిరి-4 తుఫానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. దీనితో అక్కడి ప్రజలు భయబ్రాంతులవుతున్నారు. ఫ్లోరెడాతో పాటు జార్జియా, కాలిఫోర్నియా రాష్ట్రాలలో కూడా అత్యవసర స్థితిని ప్రకటించారు. సముద్రపు అలలు 20 అడుగుల ఎత్తున ఎగసిపడతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ హరికేన్ కేంద్రభాగంలో గంటకు 345 మైళ్ల వేగంతో గాలులు వీయవచ్చని హరికేన్ సెంటర్ వెల్లడించింది. అమెరికాలో ప్రతీఏటా హరికేన్ సీజన్ జూన్ నుండి నవంబర్ వరకూ ఉంటుంది. సెప్టెంబరులో తీవ్రస్థాయిలో ఉంటుంది. హెలెన్ హరికేన్ ఫ్లోరిడా తీరాన్ని తాకితే అది ఒకే సీజన్‌లో నాలుగు కన్నా ఎక్కువ హరికేన్లు వచ్చిన రికార్డు సాధిస్తుంది.