NewsSports

దుబాయ్ స్టేడియంలో ఇండియా జెండా ఎగురేసిన ఆఫ్రిదీ కూతురు

ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ అంటే అభిమానులకే కాదు.. సెలబ్రిటీలకు, రాజకీయనేతలకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడతారన్నదానిపై రెండు దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇండియా గెలవాల్సిందేనని భారతీయులు అనుకుంటే.. పాకిస్తాన్ గెలిచి తీరాల్సిందేనని పాకిస్తానీయులు కోరుకుంటారు. సహజంగా ఇండియా-పాక్ మ్యాచ్ అన్నప్రతిసారి అటు అభిమానుల్లోనూ, ఇటు ఆటగాళ్లలోనూ ఉత్కంఠ నెలకొంటుంది.

ఐతే ఇండియాపై గెలిచి పాకిస్తాన్ ఫైనల్ కు చేరడంతో ఆఫ్రిదీ రియాక్షన్ సంచలనం కలిగించింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ గ్రేట్ స్పోర్టింగ్ ఈవెంట్ అంటూ ఆయన చేసిన కామెంట్లు రెండు దేశాల్లో క్రీడాభిమానులను ఉత్సాహపరుస్తున్నాయ్. ఇండియాతో మ్యాచ్ సందర్భంగా ప్లేయర్లతో ఆయన చేసే వ్యాఖ్యలు, సీన్లు సోషల్ మీడియాలో సంచలనంగా నిలుస్తుంటాయ్. అయితే తాజాగా ఆఫ్రిదీ ఓ ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు. గత వారం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆఫ్రిదీ కుమార్తె ఇండియా ఫ్లాగ్ ఊపిందన్నాడు.

పాకిస్తాన్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్ ప్రేక్షకులు 10 శాతం వస్తే, ఇండియా అభిమానులు 90 శాతం వచ్చారన్నారు. స్టేడియంలో పాకిస్తాన్ ఫ్లాగ్‌లు అందుబాటులో లేకపోవడంతో… నా చిన్న కుమార్తె ఇండియా ఫ్లాగ్ ఊపిందన్నాడు ఆఫ్రిది. ఆ వీడియో కూడా తన వద్ద ఉందన్నాడు.