Home Page SliderInternational

టీ 20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై ఆప్ఘనిస్తాన్ సంచలన విజయం

గుల్బాదిన్ నైబ్ (4/20), నవీన్-ఉల్-హక్ (3/20) సత్తా చాటడంతో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో కింగ్‌స్‌టౌన్, సెయింట్ విన్సెంట్‌లో జరిగిన ఐసిసి పురుషుల T20 వరల్డ్‌ కప్ లో విజయం సాధించింది. 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 127 పరుగులకే ఆలౌటైంది.గ్లెన్ మాక్స్‌వెల్ (41 బంతుల్లో 59) మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ నుండి గేమ్ ఆస్ట్రేలియాకు అందించాలని చూసినప్పటికీ, గుల్బాదిన్ నైబ్‌, అపూర్వమైన విజయం లభించింది. మాక్స్‌వెల్, స్టోయినిస్‌తో కలిసి ఆస్ట్రేలియన్ విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినా, ఆఫ్ఙనిస్తాన్ విజయం సాధించింది.

పవర్‌ప్లే ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు నష్టపోకుండా 40 పరుగులు చేయడంతో స్థిరమైన ప్రారంభాన్నిచ్చారు. గుర్బాజ్, జద్రాన్ ఇద్దరూ స్కోరు బోర్డును టిక్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు మార్కస్ స్టోయినిస్ 60 పరుగుల వద్ద గుర్బాజ్‌ను అవుట్ చేసి 118 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ను విచ్ఛిన్నం చేశాడు. ఇది ఆసీస్‌ను వెనక్కి తీసుకునేలా చేసింది. ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ కమిన్స్ ఈ మ్యాచ్ ‌లోనూ హాట్రిక్ సాధించినప్పటికీ జట్టు మాత్రం ఓడిపోయింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ గేమ్‌లలో రెండు హ్యాట్రిక్‌లు అందుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో నీతి ఏంటంటే… బలం,బలహీనత అనేది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది..

బలహీనతలు అధిగమించి జట్టును సమర్ధవంతంగా నడిపితే విజేత అవుతారు అని నిరూపించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు..