InternationalNews

హార్దిక్‌కు ఆఫ్ఘనిస్తాన్ అభిమాని వింత ప్రశంస

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసియా కప్ క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసిన సరే క్రికెట్ అభిమానుల జోరు కొనసాగుతోంది. భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే ఓ హైవోల్టేజ్ పెర్ఫార్మెన్స్ అనే ఫీలింగ్ అందరిలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఈ అభిమానం ఏ దేశం పైన వారికి ఉండటం సర్వ సాధారణమైన విషయమే. దీనికి భిన్నంగా వ్యవహారిస్తూ ఓ ఆఫ్ఘనిస్తాన్ అభిమాని చేసిన పని , సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన కొందరు టీవిలో వీక్షిస్తుంటారు.

అంతలోనే వారిలోని ఓ వ్యక్తి  హార్దక్ సిక్సర్ కొట్టిన వెంటనే పరుగు పరుగున వెళ్లి హార్దిక్‌ను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వీడియోను యూసఫ్ జాయ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా..ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. భారత్‌కు ప్రపంచం అంతా అభిమానులే అనే కామెంట్స్ కూడా ఇండియా అభిమానులు పెడుతున్నారు.