సాహసాలు కొండవీడు కోటపై అధికారుల
యడ్లపాడు: రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత ఆదివారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని చారిత్రక కొండవీడు కోటను సందర్శించారు. ఘాట్‌రోడ్డు మీదుగా చారిత్రక కట్టడాల వద్దకు చేరుకున్నారు. జెట్టి బురుజు, తూర్పు ద్వారం, పిల్లల పార్కు, లక్ష్మీనరసింహ గుడి, జడ్పీ బంగ్లా, మూడు చెరువులు, వేమన మండపం చూశారు. ఫొటోలు దిగారు. కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి కొండవీడు చారిత్రక విశేషాలను వారికి వివరించారు. అనంతరం ఆర్చరీ, పర్వతారోహణ చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు రాజు, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.