కోట్ల రూపాయల కరెన్సీతో అమ్మవారి అలంకారం
ఏపీలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమలాపురంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని వెరైటీగా అలంకరించారు. రూ.3.33 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. దీనితో భక్తులు అమ్మవారి దర్శనానికి ఆసక్తిగా తరలివస్తున్నారు. ఏపీలోనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ ఆలయంలో దుర్గమ్మని రూ. 2.20 కోట్ల కరెన్సీతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.