Home Page SliderNational

బీహార్‌లో సీట్ల సర్దుబాటు, బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 5 స్థానాలు

బీహార్‌లో ఎన్‌డిఎ తన సీట్ల వాటా ఫార్ములాను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో పోటీ చేయడానికి 17 సీట్లతో బిజెపిని ‘పెద్దన్న’గా నిలబెట్టింది. గతంలో బీహార్‌లో కూటమిలో పోల్ పొజిషన్‌లో ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ యునైటెడ్ 16 స్థానాల్లో పోటీ చేయనుంది. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో, జితన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్‌ఎల్‌ఎం ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.