అసదుద్దీన్ పిటిషన్ పై విచారణ వాయిదా
దేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991ను అమలు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఇదివరకే ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలుచేయాలంటూ నమోదైన పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి అసదుద్దీన్ పిటిషన్ ను ట్యాగ్ చేస్తూ విచారణను ఫిబ్రవరి 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
Breaking news: నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట