సిద్ధార్థ్‌తో రిలేషన్‌పై అదితి క్లారిటీ
సౌత్ హీరో, హీరోయిన్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీలపై కొంతకాలంగా మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మామూలుగానే సినీప్రపంచంలో ఏ ఇద్దరు కలిసి తిరిగినా వారిద్ధరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు మెదలవుతాయి. గత కొద్దికాలంగా సిద్ధార్థ్, అదితి కలిసి కనిపించడం, కుటుంబ ఫంక్షన్స్‌లో కలిసి తిరగడం, సినీ అవార్డుల ఫంక్షన్లకు కలిసి వెళ్లడం, తాజాగా ఇద్దరూ కలిసి ‘తుమ్ తుమ్’ అనే పాటకు చిందులేయడం వంటి సంఘటనలతో వారి రూమర్స్ తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ మధ్య అదితీరావు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ప్రేక్షకులు ఆదరించినంతకాలం తాను సినిమాలు చేస్తానని, రూమర్స్‌ను పట్టించుకోనని, జనాలు ఏవో మాట్లుడుకుంటూ సంతోషపడుతూంటారని పేర్కొంది. దర్శకులు, ప్రేక్షకలు తనను కోరుకున్నంతకాలం సంతోషంగా సినిమాలు చేస్తానని పేర్కొంది. ఈమధ్య వచ్చిన ‘మహాసముద్రం’ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించిన సమయంలో వీరిమధ్య ప్రేమ కలిగిందని పుకారు. అదితి జన్మదినం కారణంగా ఆమెతో కలిసిన ఫొటోను షేర్ చేసిన సిద్ధార్థ్ ‘హ్యాపీబర్త్‌డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం, అప్పుడప్పుడు ఇద్దరూ కలిసున్న ఫొటోలను షేర్ చేయడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది. సిద్ధార్థ్ పెళ్లయిన వాడు కావడం, అదితి ఇప్పటికే విడాకులు తీసుకుని ఉండడం గమనార్హం.