హైదరాబాద్‌లో “ఆదిపురుష్” ట్రైలర్..ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” మూవీ ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్,మీడియా కోసం ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా AMB థియేటర్‌లో ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ఆదిపురుష్ డైరెక్టర్ ఓమ్ రౌత్‌తో పాటు, హిరోయిన్ కృతి సనన్ హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా రేపు బాలీవుడ్ మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్ ఉండనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా కృతి సనన్ నటించగా.. డైరక్టర్ ఓమ్ రౌత్ ఆదిపురుష్ సినిమాకు దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాల్సివుంది.