Home Page SliderNational

యూట్యూబ్‌లో  రికార్డు సృష్టించిన “ఆదిపురుష్” ట్రైలర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన  కొత్త సినిమా ఆదిపురుష్ ట్రైలర్ నిన్న దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా భారీ అంచనాలతో రిలీజైన ఆదిపురుష్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. నిన్న అన్ని భాషల్లో  రిలీజైన ఆదిపురుష్  ట్రైలర్ 24 గంటల్లోనే 74 మిలియన్ వ్యూస్ రాబట్టింది. దీంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుంది. అయితే కేవలం ఒక్క హిందీలో మాత్రమే రిలీజైన 22 గంటల్లోనే ఏకంగా 51 మిలియన్ వ్యూస్ సాధించింది. కాగా హిందీలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా సాధించని వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విధంగా ఆదిపురుష్ ట్రైలర్  హిందీలో 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ పొందిన బాలీవుడ్ ట్రైలర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రభాస్‌, కృతి సనన్ జంటగా ఔంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. కాగా ఇది అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.