Home Page SliderTelangana

బీజేపీ గూటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యనేతలు

తెలంగాణ బీజేపీలో ఉత్సాహం తొణికసలాడుతోంది. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఎలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్ నియాకమం తర్వాత పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు మొదలయ్యాయి. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు. కార్మిక సంఘాల్లో చురుకైన పాత్ర పోషించి, పేదల హృదయాల్లో చెరగని ముద్రవేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావుతోపాటుగా, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరరాజుల శ్రీదేవి రాజేశ్వర్ (2004), ఆమె భర్త బెల్లంపల్లి మున్సిపాల్ మాజీ ఛైర్మన్ రాజేశ్వర్ రావును, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో బీజేపీ ప్రభంజనం వీయోచ్చన్న ప్రచారం ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా ఇరువురు నాయకులు పార్టీలో చేరడం బీజేపీకి జిల్లాలో బలం పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.