Home Page SliderTelangana

బర్డ్ ఫ్లూ దెబ్బకి ఆదిలాబాద్ చికెన్ మార్కెట్ బంద్

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో చికెన్ ప్రియులకు మరిన్ని కష్టాలు వచ్చాయి. బర్డ్ ఫ్లూ వల్ల భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో ప్రజలు భయపడి చికెన్, గుడ్లు తినడం మానేశారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో చికెన్ కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. అనేక చోట్ల గిరాకీలు లేక మాంసం దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఇందు మూలంగా చికెన్ మార్కెట్ల యజమానులు కొద్దిరోజులు మార్కెట్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్‌లోని చికెన్‌ మార్కెట్‌ యజమానులు వారం రోజులపాటు బంద్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.